బైక్ ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురికి గాయాలు

by Sumithra |   ( Updated:2021-03-23 01:29:39.0  )
బైక్ ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురికి గాయాలు
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ క్రాస్ రోడ్డు వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలలోకి వెళితే.. మీదికొండ గ్రామానికి చెందిన పులిగిల్ల కుమార్, పులిగిల్ల రమ్య, పులిగిల్ల రజిత రాఘవాపూర్ వెళుతున్నారు. మీదికొండ క్రాస్ రోడ్డు దాటుతుండగా హనుమకొండ నుండి హైదరాబాదు వెళుతున్న (రాజధాని ఎక్స్ ప్రెస్) వరంగల్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక పోలీసులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story