RSP గిరిజనులకు అన్యాయం చేశారు.. మంత్రికి విద్యార్థి నేత ఫిర్యాదు

by Shyam |   ( Updated:2021-08-26 00:02:51.0  )
rs-praveen-kumar 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకులాల కార్యదర్శిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న సమయంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నేత ఆరోపించారు. ఈ విషయంపై గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టకపోవడం దారుణమని ఓయూ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ భీంరావ్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకి మధ్య ఆర్థికపరమైన కోల్డ్ వార్ నడుస్తుందని తొలగించడం మంచిదే కానీ.. ఆర్ఎస్పీ గురుకులాల కార్యదర్శిగా ఉన్న సమయంలో గురుకుల సొసైటీని కలపి మూడుసార్లు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలో గిరిజనులకు అన్యాయం చేశారని విమర్శలు చేశారు.

ఈ విషయమై గతవారం 16 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి సత్యవతి దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. గిరిజన గురుకుల సొసైటీకి శాశ్వత కార్యదర్శి లేకనే వారికి అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా గిరిజన గురుకుల సొసైటీకి శాశ్వత కార్యదర్శిని నియమించాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ఈఎంఆర్ఎస్, స్పోర్ట్స్ స్కూల్‌లోని టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాల్లో, ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌లో జరిగిన అవకతవకలపై కూడా విచారణ చేపట్టాలన్నారు. లేదంటే గిరిజనులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన అక్రమాలపై సెప్టెంబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్ద 48 గంటల దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

Advertisement

Next Story