అంగన్వాడీ సిబ్బందికి రూ.50 లక్షల బీమా

by Shyam |
అంగన్వాడీ సిబ్బందికి రూ.50 లక్షల బీమా
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తూ వారికి రూ.50 లక్షల బీమా సదుపాయం కేంద్రం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వ కృషియేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి, వారికి 50 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించిందన్నారు. కానీ అంగన్వాడీలకు మాత్రం ఈ బీమా సదుపాయం కల్పించలేదని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా రూ. 50 లక్షల బీమా వసతి కల్పించాలని ఈఏడాది జూన్ 23వ తేదీన కేంద్రానికి లేఖ రాశామన్నారు.

సెప్టెంబర్ 3న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ప్రత్యేకంగా కలిసి అంగన్వాడీలకు 50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. కేంద్రం అంగన్వాడీలకు 50 లక్షల బీమా సదుపాయం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రానికి, ముఖ్యంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కృతజ్ణతలు తెలిపారు

Advertisement

Next Story