హైదరాబాద్‌లో భారీగా హవాలా డబ్బు సీజ్

by Sumithra |
హైదరాబాద్‌లో భారీగా హవాలా డబ్బు సీజ్
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: బషీర్‌బాగ్ ఎల్బీ‌స్టేడియం సమీపంలో పోలీసులు రూ.50లక్షల వాహలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీస్టేడియం ఫతేమైదాన్ అవుట్ గేట్ వద్ద ఓ కారులో పెద్ద మొత్తంలో డబ్బు అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఆ కారును అడ్డగించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా అబ్బగోనోల్ల అవినాష్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, తమిళనాడులో రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం చిత్తూరు జిల్లా శ్రీకాళహాస్తికి చెందిన రమేష్ అనే తెలిసిన వ్యక్తి పంపినట్టుగా పట్టుబడిన వ్యక్తి చెబుతుండగా.. అందుకు సంబంధించిన సరైన పత్రాలు, ఆధారాలు లేకపోవడంతో రూ.50లక్షలను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈకేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ బదిలీ చేశారు.

Advertisement

Next Story