కర్నూలులో రూ.3 కోట్ల బంగారం స్వాధీనం

by srinivas |
కర్నూలులో రూ.3 కోట్ల బంగారం స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది ఇద్దరు వ్యక్తుల వద్ద 7కిలోల బంగారాన్ని గుర్తించారు. దాని విలువు సుమారు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారానికి సంబంధించిన ఎలాంటి ధృవపత్రాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా ఈ బంగారాన్ని పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story