భారీ ఆర్థిక ప్యాకేజీలో ఎమ్ఎస్ఎమ్ఈలకు 12 నెలల మారటోరియం!

by Shamantha N |
భారీ ఆర్థిక ప్యాకేజీలో ఎమ్ఎస్ఎమ్ఈలకు 12 నెలల మారటోరియం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్టుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. ఐదు మూల సూత్రాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు. అవి ఆర్థికం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రజలు, డిమాండ్. ఇండియా‌ స్వయంగా ఎదగడమే ఈ ప్యాకేజీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధానంగా స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ఈ ప్యాకేజీ ఉద్దేశమని ఆర్థికమంత్రి చెప్పారు.

ఈ ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయన్నారు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఎమ్ఎస్ఎమ్ఈలకు సంబంధించి రూ. 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. అలాగే, పూచీకత్తు లేకుండా 12 నెలల మారటోరియంతో రుణాలు అందిస్తాం. ఎమ్ఎస్ఎమ్ఈలకు 6 అంశాల్లో ఆర్ధిక ప్యాకేజీతో ప్రయోజనం కలుగుతుంది. ఎమ్ఎస్ఎమ్ఈలు తక్షణమే ఉత్పత్తి ప్రారంభించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈల్లో ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని నిర్మలా సీతారమన్‌ చెప్పారు.

Advertisement

Next Story