ఉపఎన్నికల వేళ.. మొన్న మూడు లక్షలు.. నేడు రెండు లక్షలు

by Sridhar Babu |
ఉపఎన్నికల వేళ.. మొన్న మూడు లక్షలు.. నేడు రెండు లక్షలు
X

దిశ, మానకొండూరు : హుజురాబాద్ ఉపఎన్నికల వేళ పోలీసులు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా నగదు పట్టుబడుతోంది. ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద LMD ఎస్.ఐ ప్రమోద్ రెడ్డి తన సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి స్కార్పియో కారు నెంబర్ AP-04-AV-0456 వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా రూ.2 లక్షల నగదు దొరికింది.

ఈ డబ్బులకు ఆ వ్యక్తి ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో తదుపరి చర్యల నిమిత్తం తిమ్మాపూర్ తహసీల్దార్ గారికి డబ్బులను అందజేశారు పోలీసులు. కాగా, ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఓ వాహనదారుడి నుంచి రూ.3 లక్షలను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. వాహన తనిఖీల్లో ఎస్సై ప్రమోద్ రెడ్డి‌తో పాటు సిబ్బంది క్రైమ్ టీమ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, హేమ సుందర్, బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ సురేష్, హోంగార్డ్ రాజు, పాట్రోల్ కార్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డ్ రమేష్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story