చలికి వణుకుతున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం

by Shyam |
చలికి వణుకుతున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’(RRR). నోవెల్ కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్‌తో మూవీ షూటింగ్సన్నీ ఆగిపోయాయి. రీసెంట్‌గానే మూవీ షూటింగ్లకు అనుమతులు ఇస్తున్నారు. అయితే, అనుమతులు వచ్చినా తక్కువ మందితో కొవిడ్ రూల్స్ పాటిస్తూ మూవీ యూనిట్స్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నాయి. అలా పర్మిషన్లతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభమైంది.

ఇక ఇప్పుడు అసలే చలికాలం..అందులో రాత్రిపూట షూటింగ్ కావడంతో మూవీ యూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ఆర్ఆర్ఆర్ టీం పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ చిత్ర యూనిట్ ఓ వీడియోని షేర్ చేసింది. అందులో అందరూ చలికి వణికిపోతూ.. వేడి మంటల వద్ద చలికాచుకుంటున్నారు. ఎన్ని చలిగాలులు వీచినా.. మా టీం మాత్రం ధృడనిశ్చయంతో పనిచేస్తుందని తెలిపేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయండని పలువురు నెటిజన్లు డైరెక్టర్‌ను కోరుతున్నారు.

Advertisement

Next Story