నిండు గర్భిణీని కడుపుపై తన్నిన భర్త.. బాధితురాలు ఏం చేసిందంటే?

by Sumithra |   ( Updated:2021-11-07 09:04:08.0  )
నిండు గర్భిణీని కడుపుపై తన్నిన భర్త.. బాధితురాలు ఏం చేసిందంటే?
X

దిశ, కంటోన్మెంట్ : అతనో రౌడీ.. తాగిన మైకంలో భార్యను చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన వివాహిత రౌడీషీటర్ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. న్యూ బోయిన్పల్లి పరిధిలోని కంసారి బజారుకు చెందిన రౌడీ షీటర్ సాయి కిరణ్ అలియాస్ బిఎం సాయి(25)కు, రాజకుమారి(20)తో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. సాయి ఆటో నడుపుతూ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.

ఈ నెల 6వ తేదీన రాత్రి ఇంటికి చేరుకున్న సాయికి భార్య భోజనం పడ్డించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయి కూరలు నచ్చలేదని భార్యను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. ఆరు నెలల గర్భవతి అని తెలిసి కూడా కర్రతో కొట్టడంతో పాటు కాళ్లతో కడుపుపై తన్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story