ఆ విషయంలో చాలా బాధగా ఉన్నది : రోహిత్ శర్మ

by Shyam |
ఆ విషయంలో చాలా బాధగా ఉన్నది : రోహిత్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లతో పాటు యువకులతో నిండిపోయి ఉన్నది. అయితే బీసీసీఐ రిటెన్షన్ పాలసీ కారణంగా కీలకమైన ఆటగాళ్లను వదులుకోవల్సి వచ్చింది. ముంబై జట్టు కేవలం రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కిరాన్ పొలార్డ్‌లను రిటైన్ చేసుకున్నది. దీనిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

‘ముంబై ఇండియన్స్ జట్టులో ఎంతో మంది కీలకమైన ఆటగాళ్లు ఉన్నారు. గత కొన్నేళ్లుగా వాళ్లు జట్టుకోసం చాలా కష్టపడ్డారు. ముంబై విజయాల్లో వారి పాత్రను మరువలేనిది. అలాంటి వారిని వదులుకోవడం చాలా బాధగా ఉన్నది. ఇప్పుడు రిటైన్ అయిన వారితో పాటు ఆక్షన్‌లో కొత్త వారిని కొని బలమైన జట్టును తయారు చేసుకోవడం మా ముందు ఉన్న తక్షణ సవాలు. తప్పకుండా మెరగైన ఆటగాళ్లను ఎంచుకొని మరింత బలంగా తయారవుతాము. స్వదేశీ, విదేశీ ప్లేయర్లను పరిశీలిస్తున్నాము. వదులుకున్న ఆటగాళ్లను కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తాము’ అని రోహిత్ శర్మ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed