సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

by Sumithra |

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం జిల్లాలోని చివ్వేంల మండలం కాసింపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్ ను కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story