ఆరుగురి ప్రాణాలు తీసిన లారీ

by Anukaran |
accident
X

దిశ, వెబ్‌డెస్క్ : డ్రైవర్ అజాగ్రత్త, నిద్రమత్తు ఆరుగురి ప్రాణాలను తీసింది. పొట్ట కూటి కోసం వెళ్తున్న కూలీలను లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఏపీలోని నూజివీడులో తెల్లవారు జామున జరిగిన ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

నూజివీడు మండలం లయన్ తండాకు చెందిన 14 మంది కూలీలు ఆటోలో కూలి పనికి బయలుదేరారు. మార్గమధ్యలో గొల్లపల్లి సమీపంలోకి రాగానే మూలమలుపు వద్ద ఎదురుగా అతి వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండా మార్గమధ్యలో మృతి చెందారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో, అతివేగంగా రావడంతోనే కంట్రోల్ తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కూలీల ఆటో నుజ్జునుజ్జు అయింది. గాయపడిన వారిని పోలీసులు నూజివీడు, విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story