- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దైవ దర్శనానికి వెళ్తూ మృత్యు ఒడికి..
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై టెంపో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. మదనపల్లి నుంచి రాజస్థాన్‌లో అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వెళ్తూ 14 మంది మృత్యు ఒడికి చేరారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.