బ్రేకింగ్.. భయానక రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్

by Anukaran |   ( Updated:2021-10-22 00:40:15.0  )
బ్రేకింగ్.. భయానక రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం జజ్జర్‌లోని బద్లి పట్టణ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఎర్టిగా కారు వేగంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఓ బాలిక సహా 8 మంది మృతి చెందినట్టు సమాచారం.

స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను బహదూర్‌గఢ్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.

Advertisement

Next Story