ట్రాక్టర్, బైక్ ఢీ, ముగ్గురు దుర్మరణం

by srinivas |
road accident
X

దిశ, వెబ్‎డెస్క్: కర్నూలు జిల్లా గూడురు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం కరెంట్ సబ్ స్టేషన్ వద్ద ట్రాక్టర్‌, బైక్‌ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సీ బెళగల్‌ మండలం బ్రాహ్మణదొడ్డికి చెందిన కృష్ణ, గజ్జెలమ్మ, జానకమ్మలుగా గుర్తించారు. బ్రహ్మణదొడ్డి నుంచి ఆర్.కానాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story