మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

by Shamantha N |   ( Updated:2021-05-21 01:13:16.0  )
petrol
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ. 93.85గా ఉంది. ఇక డీజిల్ ధర 29 పైసలు పెరగడంతో లీటరుకు రూ. 83.80గా ఉంది. అలానే చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.71గా ఉండగా, డీజిల్ ధర రూ. 88.62, గా ఉంది. ఇక వాణిజ్య రాజధానైన ముంబైలో లీటరు పెట్రోల్ ధర సెంచరీకి చేరువలో రూ. 99.32 ఉండగా, డీజిల్ ధర రూ. 91.01గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.11, డీజిల్ ధర రూ. 86.64గా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 20 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.70 ఉంది, డీజిల్‌ ధర 32 పైసలు పెరిగి లీటర్ డీజిల్ ధర రూ. 91.36 ఉంది.

Advertisement

Next Story