- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్జీవీ మర్డర్ వివాదాస్పదమే..
రామ్‌గోపాల్ వర్మ మరో వివాదాస్పద ట్రైలర్‌ను వదిలాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్, మారుతీరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాడు. ‘పిల్లలను కనగలం కానీ వారి మనస్తత్వాలను కనగలమా? మీరే చెప్పండి’ అని ప్రశ్నిస్తూ ట్రైలర్ విడుదల చేసిన వర్మ.. మారుతీ రావు దృష్టి కోణంలో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? అంటూ ప్రశ్నిస్తున్న వర్మ.. ఈ చిత్రంలో అమ్మాయి పేరు అమృత అని పెట్టినట్లు అర్థం అవుతోంది. అమృత ప్రణయ్‌ల ప్రేమ, పెళ్లి నుంచి ప్రణయ్‌ను మారుతీ రావు చంపించడం, జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాక ఆత్మహత్య చేసుకోవడం వరకు మర్డర్ కుటుంబ కథా చిత్రమ్ సినిమాలో చూపించారు.
MURDER is a shocking film with electrifying performances from @drksi13 as the father @AvanchaSahithi as the daughter and @GayatriBhargav1 as the mother https://t.co/UAgl1m0ndj
— Ram Gopal Varma (@RGVzoomin) July 28, 2020
మారుతీ రావు, అమృత పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్ అయ్యర్, సాహితిల ప్రతిభను ప్రశంసించిన వర్మ.. మర్డర్ ఒక షాకింగ్ ఫిల్మ్ అని తెలిపారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించిన చిత్రాన్ని.. నట్టిస్ ఎంటర్టైన్మెంట్, క్విట్టీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. డి ఎస్ ఆర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోగా.. ట్రైలర్ చూశాక అమృత కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.