ఆరోజే భూపాలపల్లికి రేవంత్ రాక..

by Shyam |   ( Updated:2021-09-23 03:40:28.0  )
Congress party, TPCC chief Revanth Reddy
X

దిశ, భూపాలపల్లి: సెప్టెంబర్ 30వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భూపాలపల్లికి రానున్నారు. ఏఐఎఫ్ బి రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందున భూపాలపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడంలో నాయకులు నిమగ్నమై పోయారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంనకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడానికి నాయకులు సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా సభ జరిగేలా ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. శ్రీధర్ బాబుకు పట్టున్న ఈ ప్రాంతంలో సభకు భారీ ఎత్తున జన ప్రవాహము ఉండే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story