రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

by Sumithra |
Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓటుకు నోటు కేసు నెల రోజులు వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ పై బుధవారం విచారణ కొనసాగింది. దీనిపై రేవంత్ రెడ్డి, ఏసీబీ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఏప్రిల్ 8 వరకు కేసు వాయిదా వేయాలన్న రేవంత్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చాలని ఏసీబీ కోరింది. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విచారణను జాప్యం చేస్తున్నారని ఏసీబీ వాదించింది. రేవంత్ రెడ్డి న్యాయవాది సమక్షంలో సాక్షుల విచారణ చేపట్ట వచ్చునని ఏసీబీ కోర్టుకు సూచించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. కేసును ఈ నెల 15కు వాయిదా వేసింది.

Advertisement

Next Story