సూర్యాపేట జిల్లాలో ఆంక్షలు కఠినతరం

by Shyam |   ( Updated:2020-04-12 04:22:12.0  )
సూర్యాపేట జిల్లాలో ఆంక్షలు కఠినతరం
X

దిశ నల్గొండ: కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలో లాక్‌డౌన్‌‌ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. మందుల దుకాణాలు మినహా ఇతరేతర దుకాణాలను తెరవడానికి పోలీసులు అనుమతించడం లేదు. నిత్యావసరాలు, పాలు, కూరగాయల దుకాణాలను సైతం ఆదివారం మూసివేశారు. ఇంటి వద్దకే వచ్చేవిధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో క్వారంటైన్ జోన్లలో పరిస్థితిపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షిస్తున్నారు.

Tags: lockdown, restrictions,tightened, suryapet

Advertisement

Next Story