మంత్రి ఆదేశాలు బేఖాతర్.. మా ఇష్టం అంటోన్న భర్తలు (వీడియో)

by Shyam |   ( Updated:2023-10-10 15:32:01.0  )
Torroor Municipal Meeting
X

దిశ, తొర్రూరు: బతుకమ్మ చీరల పంపిణీలో ప్రజాప్రతినిధులైన భార్యల స్థానంలో భర్తలు హాజరవుతున్నారని ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇది మళ్లీ రిపీట్ కావొద్దని స్థానిక కలెక్టర్‌ను సమావేశం వేదికనుంచే మంత్రి ఆదేశించారు. అయితే.. మంత్రి ఆదేశించి 24 గంటలు కూడా గడువకముందే మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపల్ సమావేశంలో సోమవారం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో మహిళా కౌన్సిలర్స్‌తో పాటు వారి భర్తలు కూడా హాజరయ్యారు. దీనిని గమనించిన మీడియా వారిని ఫొటోలు తీయడం ప్రారంభించారు. దీంతో వారు ఆగ్రహంతో మీడియాను బయటకు పంపాలని గోల చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ కౌన్సిలర్ భర్త ‘‘మేము ఈరోజే కొత్తగా మీటింగ్‌కు వస్తున్నామా. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు.’’ అంటూ బయటకు వెళ్లడం కలకలం రేపుతోంది.

Advertisement

Next Story