షారుఖ్‌ను పొగిడిన సుస్మితా సేన్ కూతురు.. ఎందుకో తెలుసా.?

by Shyam |
Renee Sen, Shahrukh Khan
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ కూతురు రెనీ సేన్.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. తానెప్పుడూ స్క్రీన్ ప్రజెన్స్‌ను బట్టి నటులను ఆరాధించలేదని.. షారుఖ్ నిజ జీవితంలోనూ సూపర్ స్టార్ అని కొనియాడింది. తనను నిజంగా ప్రేమిస్తున్నానన్న యంగ్ గర్ల్.. మనం సొసైటీకి ఎంత ఇంపార్టెంట్ అనే ఫీల్ కలిగించడంలో తన తర్వాతే ఎవరైనా అని చెప్పింది. ప్రతీ ఒక్కరిపట్ల దయతో ఉంటాడని, మర్యాదగా ప్రవర్తిస్తాడన్న తను.. మామ్ సుస్మితాసేన్‌లోనూ ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయని తెలిపింది.

మమ్మీ రిలాక్స్‌డ్‌గా ఉంటుందని, క్రమశిక్షణకు విలువిచ్చే తను, తమ ప్రైవేట్ స్పేస్‌కు మాత్రం అడ్డురాదని చెప్పింది. ఏ విషయంలోనూ ఒత్తిడి చేయకుండా మోటివేట్ చేయడంలో ముందుంటుందని వివరించింది. ప్రస్తుతం అమ్మతో పాటు సేమ్ ఇండస్ట్రీలో ఉన్నందున రిలేషన్‌షిప్ ఇప్పుడు కొంచెం మారిపోయిందని అనుకుంటున్నట్లుగా చెప్పింది. ఇక ఇండిపెండెంట్, స్ట్రాంగ్ లేడీ నటి ప్రియాంక చోప్రా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించే విధానం తనను ఆరాధించేలా చేసిందన్నారు. ఇలాంటి వ్యక్తులను కలవడం నిజంగా హ్యాపీగా ఉందని తెలిపింది రెనీ సేన్.

Advertisement

Next Story