- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిజామాబాద్‌లో తుపాకీతో రిమాండ్ ఖైదీ పరారీ

దిశ, నిజామాబాద్
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ అసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ తుపాకీతో పరారయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ గౌతమ్‌నగర్‌కు చెందిన జీలకర ప్రసాద్ ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ దొంగతనం కేసులో నిందితుడు. ఇతన్ని మాక్లూర్ పోలీస్‌లు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం తనకు కడుపు నొప్పిగా ఉందని తెలుపగా, జిల్లా జైలు అధికారులు ఇద్దరు ఎస్కార్టు పోలీసుల సహయంతో జనరల్ ఆసుపత్రికి తరలించారు. భోజనం చేసేందుకు గాంధీ అనే కానిస్టెబుల్ వెళ్లాడు. గోపాల్ అనే హెడ్ కానిస్టేబుల్ నిందితుడితోపాటు ఉన్నాడు. కానిస్టేబుల్ నుంచి షార్ట్‌వెపన్ తీసుకుని ప్రసాద్ ఉడాయించాడు. ఆసుపత్రి పోలీస్ బూత్‌లో సిబ్బంది ఉండటంతో వెనుక నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
Tags: District jail, prisoner, escape, Nizamabad government hospital