- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీలో మెజారిటీ వాటా కొన్న రిలయన్స్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్‌వీఎల్) దేశీయ ఫ్యాషన్ రంగంలో దూకుడు పెంచుతోంది. రెండు రోజుల క్రితమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు చెందిన ఎంఎం స్టయిల్స్‌లో 40 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్‌కు చెందిన రితికా ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఒప్పందానికి సంబంధించి వివరాలను వెల్లడించనప్పటికీ రితికా ప్రైవేట్ లిమిటెడ్‌లో 52 శాతం వాటాను ఆర్ఆర్‌వీఎల్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
2014లో సింగపూర్ ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు చెందిన 35 శాతం వాటాను ఆర్ఆర్‌వీఎల్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత అదనంగా మరో 17 శాతం రితికా ప్రైవేట్ లిమిటెడ్ వాటాను కొన్నది. రీతూ కుమార్ రితికా ప్రైవేట్ లిమిటెడ్‌ను 1969లో ప్రారంభించారు. అనేక కేటగిరీల్లో కొత్త బ్రాండ్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. రోజూవారీ దుస్తులతో పాటు సాంప్రదాయ దుస్తులను కూడా ఈ కంపెనీ విక్రయిస్తోంది. 2018 నుంచి ఫార్మల్ వేర్‌తో పాటు సరికొత్త డిజైన్లలో మహిళల దుస్తుల బ్రాండ్‌ను కూడా ఈ కంపెనీ నిర్వహిస్తోంది. మొత్తం నాలుగు ఫ్యాషన్ లేబుల్‌లతో ఈ కంపెనీ దేశీయంగానే కాకుండా విదేశాల్లో దాదాపు 152 సేల్ పాయింట్లలో అమ్మకాలను నిర్వహిస్తోంది.