కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ హవా

by  |
కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ హవా
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) దూకుడుకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. వరుస రికార్డులను సొంతం చేసుకుంటున్న ఆర్ఐఎల్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ. 12 లక్షల కోట్లను చేరుకోగా, తక్కువ సమయంలో మరో రూ. లక్ష కోట్లను జమచేసుకుంది. కేవలం 8 ట్రేడింగ్ సెషన్‌ల కాలంలో లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌తో రిలయన్స్ ఈ రికార్డును దక్కించుకుంది. దీంతో రిలయన్స్ దేశీయ అత్యంత విలువైన కంపెనీగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. జులై నెల రెండోవారంలో రిలయన్స్ తన మార్కెట్ క్యాప్ రూ. 12 లక్షల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ రిలయస్ జియోమార్ట్‌లో పెట్టుబడులు పెట్టనుందనే వార్తలతో శుక్రవారం రిలయ్న్స్ షేర్ ఏకంగా రూ. 2,149.70 తో జీవిత కాల గరిష్ట స్థాయిని చేరుకుంది. ఈ పరిణామాలతో రిలయన్స్ సంస్థ దేశంలోని అత్యంత విలువైన కంపెనీగా మారగా, రెండో స్థానంలో టీసీఎస్, మూడో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.


Next Story

Most Viewed