- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడప ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా ఊహించని వ్యక్తి.. షాక్ ఇచ్చిన అధికారులు
దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా ఎవరూ ఊహించని వ్యక్తి నిలబడ్డారు. గురువారం ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆయన ఆశలకు ఎన్నికల అధికారులు బ్రేక్ వేశారు. ఆయన ఎవరో కాదు వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి. కడప ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా దేవిరెడ్డి శంకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే అధికారులు దేవిరెడ్డి నామినేషన్ పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. సరైన వివరాలు లేకపోవడంతోనే దేవిరెడ్డి శంకర్ రెడ్డి నామినేషన్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
Read More...
BREAKING: నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉంది: ఏఏజీ పొన్నవోలు సుధాకర్
కాగా వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి నిందితుడుగా ఉన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి దేవిరెడ్డి శంకర్ రెడ్డి సన్నిహితు. ఈ కేసులో భాస్కర్ రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. వివేకానందారెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే వీరికి బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు.
మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేవిరెడ్డి శంకర్ రెడ్డి స్వంతంత్ర అభ్యర్థిగా కడప ఎంపీ బరిలో నిలిచారు. అంతేకాదు నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఎన్నికల పరిశీలన అధికారులు దేవిరెడ్డి శంకర్ రెడ్డికి షాక్ ఇచ్చారు. దీంతో ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇక కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూడాలి.