ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదా.. వైశాఖ మాసంలో ఈ పరిహారాలు చేసి చూడండి..

by Sumithra |   ( Updated:2024-04-26 12:03:27.0  )
ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదా.. వైశాఖ మాసంలో ఈ పరిహారాలు చేసి చూడండి..
X

దిశ, ఫీచర్స్ : హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరంలో రెండవ నెల వైశాఖం. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, సంపదల దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తారు. శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మాసం చాలా ప్రత్యేకమైనదని కూడా చెబుతారు. ఈ మాసంలో పూజలు చేయడం వల్ల మనిషికి ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయని మత విశ్వాసం. అచితే ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి వైశాఖ మాసం ప్రారంభమై మే నెల 23వ తేదీతో ముగుస్తుంది. ఈ మాసంలో కొన్ని పరిహారాలను పాటిస్తే సంతోషం, శ్రేయస్సు లభిస్తుందని పురాణాలు చెబతున్నాయి. అంతే కాదు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఆ వ్యక్తి కొద్ది రోజుల్లోనే ధనవంతులవుతారని నమ్ముతారు. వైశాఖ మాసంలో పాటించవలసిన నియమాలు, పద్దతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వైశాఖ మాసంలో చేయాల్సిన పరిహారాలు..

హిందూ మతంలో దానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పాపాలు పోగొట్టుకోవాలంటే వైశాఖ మాసంలో నువ్వులు, మామిడి, సత్తు, వస్త్రాలు దానం చేయాలి. వీటిని దానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని అంటారు.

వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండితో చేసిన ఏదైనా వస్తువులను కొనండి. ఈ పవిత్రమైన రోజున బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని మత విశ్వాసం. దేవతలు కూడా సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు.

వైశాఖ మాసంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే పేదలకు చెప్పులు, గొడుగులు దానం చేయాలి. అలాగే జంతువులు, పక్షులకు ఆహారం, నీరు పెట్టాలి. ఈ పరిహారం జీవితంలో ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు.

ఈ మాసంలో కంచు పాత్రలలో భోజనం చేయడం వల్ల సకల రోగాలు నయమవుతాయి. వైశాఖ మాసంలో బెల్లం దానం చేయడం ద్వారా పితృ దోషం నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్య వరం కూడా లభిస్తుంది.

వైశాఖ మాసంలో వచ్చే సోమవారం నాడు, శివునికి రుద్రాభిషేకం చేసి ఆయనకు ఇష్టమైన వస్తువులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల మనిషి ఐశ్వర్యాన్ని పొందుతాడు. అలాగే కోరికలన్నీ నెరవేరుతాయి.

గ్రంధాలలో, వైశాఖ మాసం అన్ని ఇతర మాసాలలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో విష్ణువు అవతారాలైన పరశురాముడు, నరసింహ, వరాహ, కూర్మ అవతారాలను పూజిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజూ 11 సార్లు 'ఓం మాధవాయ నమః' అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed