కార్పొరేట్ల కాపలాదారు మోదీని గద్దె దించాలి : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
కార్పొరేట్ల కాపలాదారు మోదీని గద్దె దించాలి : రంజిత్ రెడ్డి
X

దిశ, తాండూరు : కార్పొరేట్‌ గద్దలకు కాపలా కాస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోందని, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి అన్ని సానుకూలతలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లకు ప్రజలలో ముఖ్యంగా మహిళలలో మంచి స్పందన లభిస్తుందన్నారు. నన్ను నమ్మండి.. ఈ దేశానికి కాపలాదారుడిగా ఉంటానని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పకిలి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ అనుకూల చట్టాలను చేస్తున్న జిత్తులమారి మోడీని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ దేశాన్ని అప్పుల పాలు చేసి, గత ప్రభుత్వాల మీద పడి ఏడుస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఏ ఒక్క మంచి కార్యాచరణను రూపొందించి అమలు చేశారో చెప్పాలన్నారు. నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని వైట్‌మనీగా మార్చి పేదల అకౌంట్‌లో డబ్బులు వేస్తామని, దేశంలో ఉగ్రవాదం, నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి , వంద మందికి పైగా చావుకు కారకులుగా మిగిలారే తప్ప నక్సలిజాన్ని, ఉగ్రవాదాన్ని పెకిలించగలిగారా అని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, పప్పు, నూనె ధరలను ఇష్టానుసారంగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు.

బీఆర్ఎస్, బీజేపీలు తోడుదొంగలు

రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీల తోడుదొంగల సినిమాను ప్రజల మధ్య బయటపెడతామని మధుయాష్కీ చెప్పారు. కేసీఆర్, మోదీలు తెరవెనుక ఏం చేశారో, తెర ముందు ఏం చేశారో వివరిస్తామన్నారు.రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు లోపాయికారీగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అసెంబ్లీ నియోజకవర్గా ల వారీగా సమస్యలను గుర్తించి ప్రత్యేక ప్రణాళికతో పోరాడాలని సూచించారు. రాహుల్‌గాంధీ చేసిన రైతు డిక్లరేషన్, ప్రియాంకాగాంధీ చేసిన యూత్‌ డిక్లరేషన్‌లను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ విషయంలో పార్టీ అనుబంధ సంఘాలు గట్టిగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాపతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామన్నారు. 100రోజుల్లోనే 6 గ్యారంటీ పథకాలు అమలు చేశామన్నారు. ఐటిఐ శిక్షణ కేంద్రం తాండూరుకి అతిపెద్ద స్థాయిలో రాబోతుందన్నారు. గని కార్మిక సొసైటీకి మళ్ళీ ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకొని ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వారి మాటలు నమ్మవద్దని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రజల సహకారంతో చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.



Next Story