- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చేనేతపై GST వేసిన ఏకైక ప్రధాని మోడీనే: మంత్రి పొన్నం
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్లకు క్లస్టర్ అడిగితే కేంద్రం ఇవ్వలేదని.. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం పదేళ్లు అధికారంలోకి ఉన్నా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని ఆరోపించారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీనేని అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కార్మికుల జీవితాలను నిజంగా బాగు చేసి ఉంటే ఈ పరిస్థితి కేవలం నాలుగు నెలలకే కూలిపోవద్దు కదా అని ప్రశ్నించారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయొద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దని.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
Advertisement
Next Story