Amaran : అమరన్ టీంను అభినందించిన సూపర్ స్టార్

by M.Rajitha |
Amaran : అమరన్ టీంను అభినందించిన సూపర్ స్టార్
X

దిశ, వెబ్ డెస్క్ : శివకార్తికేయన్‌(ShivaKarthikeyan), సాయిపల్లవి(SaiPallavi) జంటగా నటించిన చిత్రం అమరన్‌(Amaran). కమల్‌ హాసన్‌(Kamal Hassan) నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్నది. తాజాగా ఈ మూవీపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(SuperStar RajiniKanth) ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా స్టోరీ, నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చిత్రబృందాన్ని కొనియాడారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్‌ సినిమాని నిర్మించిన తన స్నేహితుడైన కమల్‌హాసన్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారంటూ మెచ్చుకున్నారు. హీరో శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్, నిర్మాత మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయిని ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌ అఫీషియల్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు.

2014లో క‌శ్మీర్‌లో ఉగ్రవాదులను ఎదురించి వీర‌మ‌ర‌ణం పొందిన త‌మిళ‌నాడుకు చెందిన ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్(Mukund VradaRajan) బయోగ్రఫీగా ఈ మూవీ తెరకెక్కింది. ముకుంద్‌గా శివ కార్తికేయ‌న్‌, ముకుంద్ భార్య ఇందు రెబెకా వ‌ర్గీస్‌ పాత్రలో సాయిపల్లవి నటించింది. రాజ్‌కుమార్ పెరియసామి సినిమాను తెరకెక్కించిన తీరుకు అంతా ఫిదా అవుతుండగా.. ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతున్నది. ఈ మూవీని కమల్‌ హాసన్‌, ఆర్‌ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెరకెక్కించింది. సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌ పేరుపై తెలుగులో విడుదల చేసింది.

Advertisement

Next Story