కాంగ్రెస్ కార్యకర్తలు సర్వేకు సహకరించాలి.. ఎమ్మెల్యే వాకిట శ్రీహరి

by Sumithra |
కాంగ్రెస్ కార్యకర్తలు సర్వేకు సహకరించాలి.. ఎమ్మెల్యే వాకిట శ్రీహరి
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టబోయే సర్వేకు కాంగ్రెస్ కార్యకర్తలు సహకరించాలని ఎమ్మెల్యే వాకిట శ్రీహరి కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్స్ లో సర్వే పై కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ఆధారంగానే రాబోయే రోజుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. సర్వేలో పాల్గొనే అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్న మాట నిజమని రాబోయే రోజుల్లోనే మంచి అవకాశాలు కార్యకర్తలకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, పీసీసీ సభ్యులు అజయ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం సదా శివారెడ్డి, వైస్ చైర్మన్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story