- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిశ, నారాయణపేట ప్రతినిధి : ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్ల పై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా పేట జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. రైస్ మిల్లుల వద్ద తాలు పేరుతో ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ప్యాడీ క్లీనర్, ఇతర సామాగ్రి వెంటనే యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. దొడ్డు రకం ధాన్యం, సన్న రకం కొనుగోలు కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దన్నారు. ఆర్డీఓ రాంచందర్ నాయక్, అధికారులు జాన్ సుధాకర్, మొగులప్ప, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
రైస్ మిల్లర్లు వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వానికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ల యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్లు వరి ధాన్యం కొనుగోలు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. మిల్లర్లు 10% గ్యారెంటీ ఇస్తూ సోమవారం నాటికి అగ్రిమెంట్లు పూర్తి చేయాలన్నారు. సివిల్ సప్లై అధికారి సుదర్శన్, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి భరత్, నారాయణ జగదీష్, హరీష్, కృష్ణ, రఘు, వీరేష్, తదితరులు పాల్గొన్నారు.