IND VS NZ : కివీస్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన పంత్

by Harish |
IND VS NZ : కివీస్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన పంత్
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన భారత క్రికెటర్‌గా రిషబ్ పంత్ ఘనత సాధించాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో శనివారం అతను ఈ రికార్డు నెలకొల్పాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతుల్లో 60 పరుగులతో రాణించాడు. అందులో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఈ క్రమంలోనే కివీస్‌పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నెలకొల్పాడు. 36బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. అంతకుముందు కివీస్‌పై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఘనత యశస్వి జైశ్వాల్ పేరిట ఉండేది. రెండో టెస్టులో అతను 39 బంతుల్లో అర్ధ శతకం బాదగా.. దాన్ని పంత్ బద్దలుకొట్టాడు. వీరి కంటే ముందు 2010లో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, తొలి టెస్టులో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 42 బంతుల్లో కివీస్‌పై అర్ధ శతకాలు పూర్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed