- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > BREAKING: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికులు
BREAKING: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికులు

X
దిశ, వెబ్‌డెస్క్: ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద చోటుచేసుకుంది. నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఘటన జరిగిన సమయంలో మొత్తం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో కొంతమంది కిటికీలోంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు పరిశ్రమ లోపల మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story