- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Investment: 5ఏళ్ల మీ కూతురి కోసం ఇలా పెట్టుబడి పెట్టండి.. ఆమె భవిష్యత్‌క ఢోకా ఉండదు!

దిశ, వెబ్ డెస్క్: Investment: మనలో చాలా మంది తమ పిల్లలపై ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలని భావిస్తారు. కానీ సరైన ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్స్ గురించి తెలియక వెనబడిపోతుంటారు. ఎందుకంటే నేటికాలంలో చాలా ధరలు పెరిగి పెతున్నాయి. ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత ఖర్చు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు, పొదుపు, పెట్టుబడులు ఇలా చెప్పుకుంటూ వెళ్తే జాబితా చాలా పొడుగ్గా ఉంటుంది.
భార్యా భర్తలు ఇద్దరు కష్టపడి సంపాదించినా కొన్ని సార్లు చేతిలో రూపాయి కూడా మిగలదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం వారి చిన్నతనం నుంచే పెట్టుబడి పెట్టినట్లయితే పెద్దగా అయ్యాక సమస్యలు ఉండవు. ఎంతోకొంత వారికోసం దాచి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే 15 నుంచి 20 ఏళ్లలో ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్ధితుల్లో 5ఏళ్ల తన కూతురి కోసం ఓ త్రండి ఏవిధంగా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
5ఏళ్ల మీ పాప పేరు మీద నెలకు 10వేల చొప్పున ఇన్వెస్ట్ పెట్టాలనుకుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటివి మంచివా లేదా షేర్లు , మ్యూచువల్ ఫండ్స్ మంచివా అనేది ముందు తెలుసుకోవాలి. కనీసం 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ పెట్టాలనుకుంటే మీ పాప ఉన్నత చదువులు, పెళ్లినాటికి ఎంత మొత్తం జమ అవుతుందో ప్రణాళిక వేసుకుని దాన్ని అనుసరించాలి.
మీ ఆర్థిక భద్రత కోసం పెద్ద వార్షిక ఆదాయానికి కనీసం 12 రెట్లు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎలాంటి స్కీములు తీసుకోవాలనుకున్నా ద్రవ్యోల్బణానికి మించి కనీసం 3 నుంచి 4శాతం అధిక రాబడి వచ్చే స్కీములు ఎంపిక చేసుకోవాలి. సాంప్రదాయ పొదపు పథకాల్లో అంతమేర రాబడి రాదు. ప్రస్తుతం సాంప్రదాయ పొదుపు స్కీముల్లో వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తున్నారు. దీంతో రాబడి మరింత తగ్గుతుందనే చెప్పాలి. మీరు మదుపు చేయాలనుకుంటున్న పాప పేరు మీద 3వేల చొప్పున సమృద్ధి యోజనలో జమ చేయండి. దీని ద్వారా ప్రస్తుతం 8.2శాతం వడ్దీ రేటు లభిస్తుంది. 15ఏళ్లలో మంచి కార్పస్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.
Read More : Post Office Scheme: ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.9,250.. ఈ స్కీమ్ వడ్డీ రేట్లు, ప్రయోజనాలు ఇవే!
SIP: రిస్క్ లేకుండా గ్యారెంటీ రాబడి పొందే మార్గం..రూ.5000తో రూ.1 కోటి మీ సొంతం