- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగళూర్‌లో ఓటు వేసిన ప్రముఖులు.. వీల్‌చైర్‌లో వచ్చిన జొమాటో డెలివరీ బాయ్
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ పలు ఆసక్తికరమైన ఫొటొలో, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బెంగళూరు జొమాటో డెలివరీ బాయ్ హిరీస్వామి వీల్‌చైర్‌లో బెంగళూరు సౌత్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన ఆయన సిరా వేలు చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
అలాగే శుక్రవారం జరిగినటువంటి పోలింగ్‌లో చాలా మంది సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత క్రికెట్ జట్టు కోచ్, రాహుల్ ద్రవిడ్, నటుడు ప్రకాష్ రాజ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య ఎంపీ సుధా మూర్తి వంటి అనేక మంది ప్రముఖులు ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, నా హక్కు కోసం నా ఓటు నిలుస్తుంది, నాకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని ఎన్నుకునే అవకాశం లభించింది. మీరు నమ్మిన అభ్యర్థిని ఎంచుకోవడం చాలా ముఖ్యం, నేను నమ్మిన అభ్యర్థికి నేను ఓటు వేశాను అని అన్నారు.
బెంగళూరులోని బీఈఎస్ పోలింగ్ బూత్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి వారి ఇళ్ల నుండి బయటకు రావాలని ఆమె అన్నారు. ఈ రోజు వేడి ఎక్కువగా ఉంది, కానీ ఓటు వేయడం చాలా ముఖ్యం. మీకు సరైన సమయాన్ని ఎంచుకుని దయచేసి రండి, ఓటు వేయండి. భారతదేశానికి ప్రతి ఓటు అవసరం అని సీతారామన్ పిలుపునిచ్చారు.