సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్

by Disha Web Desk 23 |
సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్
X

దిశ,మానకొండూర్ : మండలంలో యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. తన భూమి సమస్య పరిష్కారం కావట్లేదని, భార్య పుట్టింటికి వెళ్ళిపోయి కాపురానికి రావట్లేదని ఆవేదనతో సెల్ టవర్ ఎక్కి సుమారు ఆరు గంటలు టవర్ పై ఎక్కి యువకుడి హంగామా చేశాడు. గ్రామస్థులు,కుటుంబీకులు,పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం, వెల్ది గ్రామానికి చెందిన వడ్లూరి శ్రావణ్ అనే వ్యక్తి (32)కు గ్రామశివారులో 5 గుంటల వ్యవసాయ భూమి ఉంది. భూమి పక్కన 1,రామగిరి బాబు 2, రామగిరి నాంపల్లి, 3,రామగిరి కుమార్, 4,రామగిరి రాజయ్య, 5,రామగిరి శంకర్(డీలర్) అనే ఐదుగురు వ్యక్తుల వ్యవసాయ భూములున్నాయి. గత 6 సంవత్సరాల నుండి తన వ్యవసాయ భూమికి ఈ ఐదుగురు వ్యక్తులు దారి ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేసారు. భూమిని నా అవసరాల కోసం అమ్ముకుందామంటే విక్రయించకుండా అడ్డుకోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తెలిపారు.

3 నెలల క్రితం భార్య గీత గొడవలు పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోయి కాపురానికి రాక పోవడంతో మానసిక వేదనకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సెల్ టవర్ ఎక్కి సుమారు ఆరు గంటల పాటు హల్చల్ చేశాడు. అధికారులు భూసమస్యను పరిష్కరించాలని, భార్యను కాపురానికి పంపాలని నిరసన వ్యక్తం చేశాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎంత చెప్పిన కిందికి దిగి రాలేదు. తన సమస్య పరిష్కారానికి సీఐ రావాలని డిమాండ్ చేశారు. సీఐ మాదాస్ రాజు కుమార్ భాదితుని తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సెల్ టవర్ దిగడంతో సమస్య సద్దుమణిగింది. పోలీసులు బాధితుడిని క్షేమంగా ఇంటికి పంపించడం తో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.



Next Story

Most Viewed