- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ప్రధాని మోడీ, అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై బీజేపీ ఫిర్యాదు
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై సీఈవో వికాస్‌రాజ్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత, బీజేపీ నేత కొల్లి మాధవి సీఈవోను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. అనంతరం అద్దంకి దయాకర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో మాట్లాడిన అద్దంకి దయాకర్ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాపై వివాదస్పద వ్యాఖ్యలు చేయగా.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా అయ్యాయి. దీంతో అయనపై హిందూ సంఘాల నేతలు, బీజేపీ ఫైర్ అవుతున్నాయి. ‘అద్దంకి దయాక్ మాట్లాడుతూ నేడు తెలంగాణలో మేము హిందువులం హిందువులం అని చెప్పుకుంటున్నారు. రాముడు మీకు చిన్నయ్యనా.. లేక సీత మీకేమైనా చిన్నమ్మనా, మీరేమైనా రాముడి వంశంలో పుట్టారా.. వీళ్లకు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్‌గా హీట్‌ను పుట్టిస్తున్నాయి.