KA Paul: ఎన్నికల వేళ సరికొత్త వేషంలో కేఏ పాల్.. ఈసారి గెటప్ అదుర్స్

by Disha Web Desk 1 |
KA Paul: ఎన్నికల వేళ సరికొత్త వేషంలో కేఏ పాల్.. ఈసారి గెటప్ అదుర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్ల నుంచి ఓట్లను రాబట్టేందుకు కొంతమంది నేతలు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఒకరు పిల్లాడికి స్నానాలు చేయిస్తే.. మరికొందరు ముసలివాళ్లకు అన్నం తినిపిస్తూ ఫొటోలకు ఫోజులిస్తు్న్నారు. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినూత్న రీతీలో ప్రచారానికి తెర లేపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా..ఇంతా కాదు. అవతలి వ్యక్తి తన ప్రత్యర్థి అని ఫిక్స్ అయితే సీఎం, పీఎం, ప్రెసిడెంట్ అనే తేడా లేకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం కేఏ పాల్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో భాగంగా ఆయన విశాఖలోని మత్య్సకారుల వద్దకు వెళ్లారు. ప్రతి గడపగడపకు వెళ్లి తనకే ఓటెయ్యాలంటూ అభ్యర్థించారు. అనంతరం మత్య్సకారుడిలా వేషం కట్టి వారితో కలిసి చేపలు పట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎంపీగా విజయం సాధిస్తే రాబోయే రోజుల్లో మినీ హార్బర్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

Click Here For Twitter Post

Next Story

Most Viewed