- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 స్టార్టప్‌లకు తోడ్పాటు
దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19తో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ పరిణామాలతో స్టార్టప్‌లకు కూడా సమస్యలు తలెత్తాయి. అలాంటి స్టార్టప్‌లకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్‌తో కలిసి రె-జిగ్ హైదరాబాద్ స్టార్టప్ సంస్థ తోడ్పాటునందించేందుకు ముందుకొచ్చింది. ఎకో సిస్టంతో కొత్త ఆవిష్కరణలకు సహకారాన్ని అందించనున్నారు. టీ హబ్, సీఐఈ-ఐఐఐటీహెచ్, ఐకేపీ, రిచ్, టీఐఈ వంటి సంస్థల్లో కొత్త ఆవిష్కరణలను రూపొందిస్తున్న వారికోసం ప్రాజెక్టును రూపొందించినట్లు ఐకేపీ సీఈఓ, ఛైర్మన్ దీపన్విత చటోపాధ్యాయ సోమవారం చెప్పారు.
ప్రధానంగా ఎడ్యుటెక్, ఫైనాన్షియల్ టెక్, అగ్రి, ఫుడ్‌టెక్, మెడికల్, లైఫ్ సైన్సెస్, ఎమెర్జింగ్ టెక్నాలజీస్ పైనా దృష్టి పెట్టినట్లు తెలిపారు. స్టార్టప్‌లను ఎంపిక చేసి మూడు వారాల పాటు వ్యాపార దృక్కోణంపై సమీక్షించనుంది. 100 స్టార్టప్‌లకు ఈక్విటీ ఫండింగ్, కొలటెరల్ ఫ్రీ డెబిట్ ఫండింగ్, కార్పొరేట్ మార్కెట్ సదుపాయం కల్పించనున్నట్లు వివరించారు. అవసరమైన స్టార్టప్‌ల కోసం గతనెల 20నుంచి దరఖాస్తులను రెజిగ్ హైదరాబాద్ స్టార్టప్స్ ద్వారా సేకరిస్తున్నామని, ఆగస్టు రెండోవారం వరకు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రశంసించారు. నగరంలో స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సంయుక్తంగా స్టార్టప్‌లను బలోపేతం చేసేందుకు ముందుకొస్తున్నట్లు కొనియాడారు.