తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు… ఎంత తగ్గిందో తెలుసా?

by Anukaran |   ( Updated:2021-03-24 00:31:46.0  )
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు… ఎంత తగ్గిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలకు ఇందనపు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇన్నాళ్లూ వాహనదారుల జేబులను గుళ్ల చేస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌ 18పైసలు, డీజిల్‌పై 17 పైసలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇకపోతే దేశ రాజధాని ఢిల్లీ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.91.17 ఉండగా.. 18పైసలు తగ్గి రూ.90.99కి చేరింది. డీజిల్ రూ.81.47 ఉండగా.. 17 పైసలు తగ్గి రూ.81.30 చేరింది. ముంబై లో లీటర్ పెట్రోల్ రూ. 97.40 , డీజిల్‌ ధర 88.42 కోల్ కత్తా లో పెట్రోలు ధర 91.18 డీజిల్‌ ధర 84.18 కి చేరింది.

ఇక తెలంగాణ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.61గా, డీజిల్‌ ధర రూ.88.67గా ఉంది.ఈ క్షీణత ఇలాగె కొనసాగుతుందా? లేక మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? అనేది ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. ఇదివరకు ఒక లీటర్ పెట్రోలు రూ.100 తో సెంచరీ దాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఈ తగ్గింపు ధరలు కొంత ఊరటను ఇస్తున్నాయి.

Advertisement

Next Story