- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశీయ ఆటోమొబైల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం
దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీని తగ్గించడం, భారతీయ బ్రాండ్ల విదేశీ ప్రమోషన్‌ల కోసం యంత్రాంగం, దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆటోమొబైల్స్ కోసం ప్రత్యేక విభాగం, దేశీయ సామర్థ్యాన్ని పెంచేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళిక అవసరమని పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు నెమ్మదించడంపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రోత్సాహక-ఆధారిత వాహన స్క్రాపేజ్ పథకంతో పాటు అన్ని విభాగాల వాహనాలు, ఆటో భాగాలకు జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని వాణిజ్య సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కోరుతోంది.
ఈ వారంలో పార్లమెంట్ ఉభయ సంభల్లో ప్రవేశపెట్టిన ‘కరోనా అనంతర ఆర్థికవ్యవస్థలో పెట్టుబడులను ఆకర్షించడం- దేశీయ సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై వాణిజ్య విభాగ స్టాండింగ్ కమిటీ పై సూచనలను చేసింది. ప్రభుత్వ బ్రాండ్ల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టాలని, అంతర్జాతీయ మార్కెట్లో వాటిని ప్రోత్సహించాలని కమిటీ కోరింది. నైజిరియా, కెన్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇండోనేషియా, వియత్నాం తదితర మార్కెట్లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని సూచించింది. ఆటోమోటివ్ పరిశ్రమ విధానం, సాంకేతిక నిబంధనలు, వాహనాల సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆయా దేశాల మార్కెట్లలో దేశానికి ప్రయోజనాలుంటాయని కమిటీ వెల్లడించింది.