3 కోట్ల స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు సాధించే అవకాశం

by Harish |
3 కోట్ల స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు సాధించే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ రియల్‌మీ భారత్‌లో ఈ ఏడాది మొత్తం అమ్మకాల్లో 30 శాతం వృద్ధితో 2-3 కోట్ల యూనిట్ల అమ్మకాలు నమోదవుతాయని ఆశిస్తోంది. వివిధ ఆడియో ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఉన్నాయని అభిప్రాయపడింది. 2020 కంపెనీ అసాధారణమైన వృద్ధిని చూడగలిగిందని, కరోనా సంక్షోభం కారణంగా పావు వంతు విలువైన అమ్మకాలను కోల్పోయినప్పటికీ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 25 శాతంతో 1.9 కోట్ల యూనిట్ల అమ్మకాలను నిర్వహించగలిగిందని రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ చెప్పారు.

‘సరఫరాలో భారీగా అంతరాయాలు ఏర్పడటంతో అమ్మకాలు కోల్పోయామని, అయినప్పటికీ 2019లో 1.5 కోట్ల యూనిట్లతో పోలిస్తే 2020లో 1.9 కోట్లకు అమ్మకాల వృద్ధిని సాధించగలిగామని, ఈ వృద్ధి అసాధారణమని, ఏడాది ముగిసేలోగా 2-3 కోట్ల అమ్మకాలు సాధించగలమనే నమ్మకం ఉందని, 2021లో కొత్త లక్ష్యాలను కలిగి ఉన్నామని’ ఆయన వివరించారు. మార్కెట్ ఎప్పుడూ రూ. 15 వేల స్మార్ట్‌ఫోన్‌ల చుట్టూనే ఉండేవని, 2020లో కరోనా తర్వాత ఇది విస్తరించిందని మాధవ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం…2020, సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎగుమతులు 17 శాతం వృద్ధి చెంది, రికార్డు స్థాయిలో 5.4 కోట్ల యూనిట్లను నమోదు చేసింది.

Advertisement

Next Story