హార్వెస్టర్లు రెడీగా ఉంచండి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

by Aamani |
హార్వెస్టర్లు రెడీగా ఉంచండి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
X

దిశ, ఆదిలాబాద్:
రబీలో వరి కోతలు దగ్గరపడుతున్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హార్వెస్టర్‌లను సిద్ధంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో హార్వెస్టర్ కంపెనీల డీలర్లు, విడి భాగాల షాపు ఓనర్లతో సమావేవం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 14వరకు లాక్‌డౌన్ పొడిగించిందని, కావున వరి కోత సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు హార్వెస్టర్ లను సిద్ధంగా ఉంచాలన్నారు. హార్వెస్టర్ మిషన్ చెడిపోతే దానిని వెంటనే రిపేర్ చేయించేందుకు కావాల్సిన విడి భాగాలను అందజేయాలని కోరారు. పంట కోత సమయంలో హార్వెస్టర్ డ్రైవర్, మెకానిక్‌లకు పాసులు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి అంజు కుమార్ పాల్గొన్నారు.

Tags: carona,lockdown, crop cutting machine, collecter baskar rao

Advertisement

Next Story

Most Viewed