అధైర్యపడొద్దు ప్రతిగింజ కొంటాం: ఆర్డీఓ

by Shyam |   ( Updated:2021-10-30 07:07:53.0  )
అధైర్యపడొద్దు ప్రతిగింజ కొంటాం: ఆర్డీఓ
X

దిశ, హుస్నాబాద్: అన్నదాతలు అధైర్యపడొద్దని ప్రతి గింజ కొంటామని ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా శనివారం అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డుల్లో రైతులకు అన్ని వసతులతో పాటు కావాల్సిన టాప్పలింన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో అక్కన్నపేట జడ్పిటీసీ భూక్య మంగ, ఎంపీపీ మాలోతు లక్ష్మి, మార్కెట్ కమిటి చైర్మన్ కాసర్ల అశోక్ బాబు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్ధార్ వేణుగోపాల్ రావు, ఎంపీటీసీ రవిందర్, సింగిల్ విండో డైరెక్టర్ బుర్ర ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story