ఎస్‌బీఐకి రూ. కోటి జరిమానా

by  |
sbiiii
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)కు ఆర్‌బీఐ భారీ షాక్ ఇచ్చింది. కమర్షియల్ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించిన ఆదేశాలను పాటించక పోవడంతోపాటు, ఫ్రాడ్ కేసులను వర్గీకరించడంలో లోపాల కారణంగా రూ. కోటి భారీ జరిమానా విధించింది. రెగ్యులేటరీ ఆదేశాల్లో లోపాల ఆధారంగా బ్యాంకు ఖాతాదారులతో జరిపిన లావాదేవీ, ఒప్పందాలను బహిర్గతం చేయకూడదు. ఎస్‌బీఐ ఈ నిబంధనలను అతిక్రమించిందని, అందుకే జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ల పరిశీలన, అందుకు సంబంధించిన నియంత్రణ ఆదేశాలకు అనుగుణంగా ఎస్‌బీఐ వద్ద వివరాలు లేకపోవడంతో ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, ఈ కారణంతో జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు చెప్పాలని ఎస్‌బీఐకి ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా ఎస్‌బీఐ ఇచ్చిన వివరణను పరిశీలించిన అనంతరం ఆర్‌బీఐ ఆదేశాలను ఎస్‌బీఐ పాటించలేదని తేలింది. ఈ నేపథ్యంలో పెనాల్టీ విధించారని, నగదు రూపంలో ఈ జరిమానా ఉండొచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed