హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై ఆర్‌బీఐ షాక్!

by Harish |   ( Updated:2020-12-03 06:12:32.0  )
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై ఆర్‌బీఐ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీపై ఆంక్షలను విధించింది. ఇటీఅల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రారంభించిన డిజిటల్ 2.0 కార్యక్రమాన్ని ఆపేయాలని, దీంతోపాటు కొత్త క్రెడిట్ కార్డుల మంజూరును నిలిపేయాలని ఆర్‌బీఐ ఆదేశాలను జారీ చేసింది. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవలు ఈ మద్య 12 గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గత కొంత కాలంగా తరచూ ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడుతున్న కారణంగా ముందు దానికి పరిష్కారాన్ని వెదకాలని ఆర్‌బీఐ సూచించింది.

డిజిటల్ 2.0 కార్యక్రమంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రవేశపెట్టిన అన్ని రకాల డిజిటల్ సంబంధిత కార్యక్రమాలన్నిటినీ తాత్కాలికంగా నిలిపేయమంటూ ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నిబంధలను అనుసరిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. తాజా ఆర్‌బీఐ విధించిన ఆంక్షల వల్ల రోజూవారీ బ్యాంకు కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండని ప్రకటించింది. ఖాతాదారులకు అవసరమైన అన్ని సేవలను మాములుగానే కొనసాగిస్తామని, డేటా సెంటర్‌లో ఏర్పడ్డ విద్యుత్ సరఫరా వైఫల్యం వల్ల సేవలలో ఇబ్బందులు ఎదురయ్యాయని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed