కరోనాను అరికట్టేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం

by Harish |
కరోనాను అరికట్టేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు, దాని ప్రభావంతో కలుగుతున్న నష్టాన్ని అధిగమించేందుకు ఇప్పటికే అనేక దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మనదేశంలోనూ కరోనాను అరికట్టేందుకు ఆర్‌బీఐ కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్(ఓఎంవో) నుంచి రూ. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి కారణంగా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఐదేళ్లలో రూ. 10 వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలును ఈ నెల 20 ప్రారంభించనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆర్‌బీఐ సుమారు 125 పాయింట్ల వరకూ కీలకమైన వడ్డీ రేట్లలో కోత పెడుతుందనే ఊహాగానాలకు బలాన్నిచ్చింది. ఇదివరకే ప్రపంచ దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు రేట్ల కోటలను ప్రకటించాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అత్యధికంగా రేట్ల కోతకు దిగింది. అమెరికాతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్, యూరోపియన్ దేశాలు కీలక రేట్లలో కోతలను వెల్లడించాయి.

Tags : OMO purchase, RBI, Reserve Bank of India

Advertisement

Next Story

Most Viewed