సిరాజ్ సవాళ్లను అధిగమించాడు: రవి శాస్త్రి

by  |   ( Updated:2021-01-22 07:50:43.0  )
సిరాజ్ సవాళ్లను అధిగమించాడు: రవి శాస్త్రి
X

దిశ, వెబ్‌డెస్క్: అనతి కాలంలోనే టీమిండియా జాతీయ జట్టులో చోటు సంపాధించిన ఫేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. తొలిసారిగా భారత జట్టు తరఫున ఆసీస్‌ టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ ఆటతీరు ఆదర్శనీయమన్నాడు. ఆసీస్‌ టూర్‌లో సిరాజ్ బౌలింగ్‌ అటాక్‌‌ పెంచే విధానాన్ని అందరూ నేర్చుకోవాలన్నాడు. ఓ వైపు వ్యక్తిగత బాధ(తండ్రి మరణం), మరోవైపు ఆసీస్ అభిమానుల వ్యాఖ్యలను అధిగమించి ఎలా పోరాడాలో నేర్పించాడన్నాడు. అన్ని సవాళ్లను అధిగమించి.. బ్రిస్బేన్ మ్యాచ్‌లో జట్టు విజయంలో కీలకంగా నిలిచాడన్నాడు. కాగా, తొలి టెస్టు సిరీస్‌లోనే 13 వికెట్లు తీసుకున్న సిరాజ్.. ఆసీస్‌ టూర్‌లో తనను తాను నిరూపించుకున్నాడు. దీంతో తొలి పర్యటనలోనే భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో సిరాజ్ ప్రథమ స్థానంలో నిలిచాడు.

Advertisement

Next Story