బేర్ గ్రిల్స్‌తో కలిసి రణ్‌వీర్ సింగ్ అడ్వెంచర్స్

by Shyam |   ( Updated:2021-07-10 04:35:14.0  )
బేర్ గ్రిల్స్‌తో కలిసి రణ్‌వీర్ సింగ్ అడ్వెంచర్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేయడంలో ముందుంటాడు. బిగ్ స్క్రీన్‌పై ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న రణ్‌వీర్.. ఈ మధ్యే బుల్లితెరపై కూడా హోస్ట్‌గా మారబోతున్నట్లు ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశాడు. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచర్‌తోపాటు.. బ్రిటిష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు.

ఈస్ట్ యూరోపియన్ కంట్రీలో చిత్రీకరణ జరగనుండగా, ఇప్పటికే అక్కడికి చేరుకున్న ‘గల్లీ బాయ్’ స్టార్.. బేర్ గ్రిల్స్‌తో కొలాబొరేట్ కావడంపై ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపాడు. ఈ షో భారీ బడ్జెట్‌తో రూపొందుతుండగా.. ఇంకా పూర్తి డిటెయిల్స్‌ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్తున్నారు రణ్‌వీర్ ఫ్యాన్స్. ఈ క్రమంలో దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసే అవకాశముంది. కాగా డిస్కవరీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ ’ కోసం నరేంద్ర మోడీ, రజినీకాంత్‌లతో కలిసి అడ్వెంచర్స్ చేసిన బేర్ గ్రిల్‌కు ఇండియా నుంచి కోట్లాది మంది అభిమానులున్నారు.

Advertisement

Next Story